Friday, April 2, 2010

నేస్తం

నేస్తం,

నీ కోసం ఎక్కడని వెదకను?

ఎడారులా ఇసుకమేతల్లో

వడగాలుల తివ్రతలో

కూరుకు పోయవనుకున్నాను.

అడవుల్లో, ఆకుల గలగలోల్లో

సెలయురులో పారేనీటి అలల్లో

అడుగడుగునా వేదికను

ఆకులమతుల్లో అలల లోతుల్లో
దాగుంది పోయవనుకున్నాను

చిన్నారి కేరింతల్లో

చిరుతాల్ చిరుగాన్ద్రిమ్పుల్లో
ఉషోదయ కిరణాల్లో

సంధ్యరున క్రీనీడల్లో

అంతటా వేదికను

చిన్నారి చిలక పలుకుల్లో

చిరుత చురుకు చూపుల్లో

వెలుగునీడల యవనికలో

కనుమరుగయ్యవనుకున్నాను

కాని!

మూసినానా హృదయంలోనే

దాగుని నన్ను మేల్కొల్పుతున్నవని

తెలుసుకోలేకపోయాను.